వివాదాస్పద గ్రామాల్లో ఏపీ ఎన్నికలు.. ఒడిశా బీజేపీ ప్రభుత్వంపై నవీన్ పట్నాయక్ ఫైర్
Advertisement
- వివాదాస్పద కోటియా గ్రామాల్లో ఏపీ ఎన్నికల నిర్వహణపై దుమారం
- కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం కావడంతోనే బీజేపీ మౌనమా? అని ప్రశ్న
- ఒడిశా ప్రయోజనాలను కాపాడాలంటూ సీఎంకు నవీన్ లేఖ
Advertisement
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కోటియా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వివాదాస్పద ప్రాంతంలోని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఒడిశా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టాంగి బ్లాక్ పరిధిలోకి వచ్చే ఫాగునసినేరి, గంజేపాడర్, ఫతుసినేరి గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడాన్ని నవీన్ పట్నాయక్ ఆక్షేపించారు. ఈ పరిణామం అత్యంత ఆందోళనకరమని పేర్కొంటూ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి ఆయన లేఖ రాశారు.
2024 ఎన్నికలకు ముందు 'డబుల్ ఇంజిన్ సర్కార్' అధికారంలోకి వస్తే కోటియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విషయాన్ని నవీన్ పట్నాయక్ గుర్తుచేశారు. ఈ రాజకీయ కారణాల వల్లే ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతోందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశా భూభాగ సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
కోటియా పంచాయతీలో మొత్తం 28 గ్రామాలు ఉండగా, వాటిలో 21 గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ తన అధికారాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే.